ప్రభుత్వం చేసిన హత్యలు. - మాజీ మంత్రి రోజా 15 h ago
AP: చంద్రబాబు ఎప్పుడు సీఎం అయితే అప్పుడు రాష్ట్రంలో చావులు అని మాజీ మంత్రి రోజా విమర్శించారు. ఆయన లెగ్ మహత్యం అనుకుంటా అని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న పవన్ కల్యాణ్ ఎక్కడ? అని ప్రశ్నించారు. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్ల 29 మంది చనిపోయారని గుర్తు చేశారు. మొన్న చంద్రబాబు సీఎం అయ్యాక కేవలం ఆయన నిర్లక్ష్యం వల్ల విజయవాడ వరదల్లో 60 మంది మృతి చెందారని చెప్పారు. మంచి జరిగితే మా ఘనత అని చెప్పుకుంటారు చెడు జరగితే మాత్రం గత ప్రభుత్వం మీదకు, అధికారుల మీదకు నెట్టి తప్పించుకుంటారని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు.